కర్ణాటక బళ్లారిలో కరోనా కేసులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో బాధితులంతా బెంబేలెత్తిపోతున్నారు. కానీ, ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చాంద్ పాషా మాత్రం.. కరోనాకు భయపడే పనేలేదంటున్నాడు. యోగా, ఆయుర్వేదంతో సాటి రోగుల్లో బతుకుపై ఆశలు కల్పిస్తున్నాడు.
కంప్లీ తాలూకాలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు చాంద్పాషాకు కరోనా సోకింది. చికిత్స మేరకు స్థానిక వీఐఎమ్ఎస్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కరోనా బాధితులు చావు భయంతో వణికిపోతున్నారని గమనించాడు. ఆత్మబలం ఉంటే కరోనాను జయించొచ్చని వారికి నచ్చజెప్పాడు పాషా. వారిలోని ఒత్తిడిని పోగొట్టేందుకు ఉదయం తన వార్డులో ఉన్నవారిచేత యోగాసనాలు వేయించడం మొదలెట్టాడు.