తెలంగాణ

telangana

ETV Bharat / bharat

14 ఏళ్లు కారాగారంలో.. బయటికొచ్చాక డాక్టర్​! - Kalaburagi murderer became doctor after 14 years

ప్రతి ఒక్కరి జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఒక్కోసారి ఆ మలుపుల్లో చిన్నప్పటి ఆశయాలు, సాధించాలనుకున్న లక్ష్యాలు చెల్లాచెదురు అవుతూంటాయి. కర్ణాటకకు చెందిన సుభాష్​ పాటిల్​ జీవితంలోనూ ఇలాగే జరిగింది. డాక్టర్​ అవ్వాలనుకున్న తాను అనుకోని పరిస్థితుల్లో హంతకుడయ్యాడు. చేసిన నేరానికి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి, ఎట్టకేలకు డాక్టర్​ పట్టా పొందాడు. అతడి విజయగాథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అతడి కథేంటో చదివేయండి మరి...

a convict became doctor after 14 year of prison in karnataka kalaburagi
14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాకే డాక్టర్​ అయ్యాడు!

By

Published : Feb 15, 2020, 7:26 PM IST

Updated : Mar 1, 2020, 11:09 AM IST

14 ఏళ్లు కారాగారంలో.. బయటికొచ్చాక డాక్టర్​!

డాక్టర్ కావాలనేది అతని ఆశయం. దానికి తగ్గట్లుగానే ఎంబీబీఎస్​ సీటు సాధించాడు. కానీ, అనుకోకుండా హంతకుడిగా మారాడు. చేసిన తప్పునకు 14ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు. అయినా.. జీవిత ఆశయాన్ని మాత్రం మార్చుకోలేదు. తన జీవితాన్ని ఎక్కడ పోగుట్టుకున్నాడో తిరిగి అక్కడి నుంచే ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కర్ణాటకకు చెందిన సుభాష్ పాటిల్.

ప్రేయసితో కలిసి హత్య..

కర్ణాటక కలబుర్గికి చెందిన సుభాష్‌ పాటిల్‌.. 1997లో ఎంబీబీఎస్‌లో చేరాడు. ఆ సమయంలో తన ఇంటికి సమీపంలో ఉండే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. అప్పటికే పెళ్లయిన ఆమె భర్తకు ఈ విషయం తెలిసి బెదిరించినందున.. ప్రేయసితో కలిసి ఆమె భర్తను హత్యచేశాడు సుభాష్​. ఈ కేసులో సుభాష్‌ పాటిల్‌, సదరు మహిళ దోషులుగా తేలినందున.. 2002లో కోర్టు వారికి జీవిత ఖైదు ఖరారు చేసింది. అప్పటికి ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న సుభాష్‌ చదువు అక్కడితో ఆగిపోయింది.

అయితే, 14 ఏళ్ల జైలు జీవితం గడిపిన సుభాష్‌ సత్ప్రవర్తన కారణంగా 2016లో విడుదలయ్యాడు. బయటకు వచ్చిన సుభాష్.. డాక్టర్‌ కావాలన్న తన ఆశయాన్ని మాత్రం మరవలేదు. ఎలాగైనా ఎంబీబీఎస్‌ పూర్తిచేయాలని నిశ్చయించుకుని మధ్యలో వదిలేసిన చదువు కొనసాగిస్తానని సదరు యూనివర్సిటీకి విన్నవించుకున్నాడు. అతని అభ్యర్థనను మన్నించిన విశ్వవిద్యాలయం న్యాయసలహా అనంతరం చదువు కొనసాగించేందుకు అంగీకరించింది. ఫలితంగా 2016లో ఎంబీబీఎస్​లో తిరిగి చేరిన సుభాష్‌.. 2019లో ఎంబీబీఎస్ పట్టా పొందాడు. తాజాగా ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేసుకున్నాడు. పూర్తిస్థాయి వైద్యుడిగా సేవలు అందించేందుకు సిద్దమయ్యాడు.

"డాక్టర్ కావాలనేది నా చిన్నప్పటి కల. 1997లో ఎంబీబీఎస్‌లో చేరా. ఐతే రెండేళ్ల తర్వాత దురదృష్టవశాత్తూ జైలుకు వెళ్లా. నా జీవితంపై ఆశలు వదిలేసుకున్నా. జైలులోనే చదవడం ప్రారంభించా. అలా జైళ్లో ఉన్నప్పుడే కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ ద్వారా జర్నలిజంలో డిప్లొమా, ఎంఏ జర్నలిజం పూర్తిచేశా. సత్ప్రవర్తన కారణంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2016లో ప్రభుత్వం నన్ను విడుదల చేసింది. బయటకు వచ్చాకా సమాజం నన్ను ఎలా చూస్తుందోనని అనుమానం వేసింది. ఎంబీబీఎస్ లో తిరిగి చేరాలని మా నాన్న సూచించారు. దీంతో తిరిగి చదువుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తే... 2016 సెప్టెంబర్ లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఎంబీబీఎస్ పూర్తిచేసేందుకు సమ్మతించింది."

-సుభాష్ పాటిల్

పుట్టుకతోనే ఎవరూ నేరస్థులు కారంటున్న సుభాష్.. పరిస్థితులే వారిని అలా మారుస్తాయని అంటున్నాడు. క్లినిక్ ఏర్పాటు చేసి జవాన్లు, జైలులో ఉన్న ఖైదీల కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెబుతున్నాడు..

"జైలు అనేది భూమ్మీద ఉన్న నరకం. ఒక్కటి మాత్రం నిజం. పుట్టుకతోనే ఎవరూ నేరస్థులు కాదు. పరిస్థితులే వారిని అలా తయారుచేస్తాయి. జైలుకు వెళ్లాలని ఎవరూ అనుకోరు. దురదృష్టవశాత్తూ పరిస్థితులే వారిని జైళ్లోకి నెడతాయి. భవిష్యత్తులో ఖైదీల కుటుంబసభ్యులకు ఉచితంగా చికిత్స

అందిస్తా."

-సుభాష్ పాటిల్

తప్పు చేసి శిక్ష అనుభవించినప్పటికీ..తన ఆశయాన్ని సాధించుకున్న సుభాష్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:పాఠశాల బస్సులో మంటలు.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

Last Updated : Mar 1, 2020, 11:09 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details