నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగీ జమాత్ సమ్మేళనంలో పాల్గొన్న విషయాన్ని దాచిన దిల్లీ కాంగ్రెస్ నేత, మాజీ కౌన్సిలర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు ముందు ఆయన్ను పోలీసులు పదేపదే ప్రశ్నించినప్పటికీ మర్కజ్ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఆయనతో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కొవిడ్-19 సోకినట్లు నిర్ధరణ కావడం కలకలం రేపుతోంది.
ఒక్కరి నిర్లక్ష్యంతో ఊరంతా లాక్‌డౌన్
ప్రస్తుతం ఆ వ్యక్తి సతీమణి కౌన్సిలర్‌గా సేవలందిస్తున్నారు. వైరస్ సోకిన ఈ ముగ్గురినీ అంబేడ్కర్ ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు మీడియాకు తెలిపారు. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు దక్షిణ దిల్లీలోని దీన్‌పుర్ గ్రామం మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాల్సి వచ్చిందని అంటున్నారు. అంటే నిత్యావసరాలకు సైతం ప్రజలు బయటకు రావడానికి వీల్లేదు. ప్రభుత్వమే వారికి అన్నీ సమకూరుస్తుంది.