తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

ఫొని... ఒడిశాను అతలాకుతలం చేసిన ప్రచండ తుపాను. భారీ వర్షాలు, పెను గాలులతో భారీ ఆస్తి నష్టం మిగిల్చింది. ఎంతో మందిని నిరాశ్రయుల్ని చేసింది. అలా నీడ కోల్పోయిన జీవుల జాబితాలో అనేక పిల్లులు, కుక్కలు ఉన్నాయి. అలాంటి మూగజీవాలకు అండగా నిలిచేందుకు కొందరు ముందుకు వచ్చారు.

'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

By

Published : May 16, 2019, 8:42 AM IST

'ఫొని' దెబ్బతీసింది- మంచితనం ఆదుకుంది

అది ఒక జంతువులు, పక్షుల సంరక్షణ కేంద్రం. నిరాదరణకు గురైన ఎన్నో మూగజీవాలు అక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. ఏకమ్రా జంతు సంక్షేమ సంస్థ... ఒడిశా కటక్​ సమీపంలోని సుందర్​గ్రామ్​లో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.

మే 3న ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపాను కారణంగా సంరక్షణ కేంద్రం దెబ్బతింది. ఎన్నో జీవాలు ఆశ్రయం కోల్పోయాయి. దాతల సహకారంతో సంరక్షణ కేంద్రం పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు.

"ఫొని తుపాను ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందని మేము ఊహించలేదు. ముందుగా ఈ మూగజీవాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావించాం. అయితే వాటిని తరలించడానికి సరైన ప్రదేశం మాకు దొరకలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నవి తాత్కాలిక షెడ్లు. అది నిజంగా ఒక పీడకల. ఒకానొక సమయంలో ఈ మూగజీవాలను కోల్పోతామేమో అని భయపడ్డాం. మేము విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన నిధులతోనే నడుస్తోంది."
- పర్బీ పాత్రా, ఏకమ్రా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు

ఇదీ చూడండి: ఒడిశాలో 'ఫొని' నష్టం రూ.12వేల కోట్లు

ABOUT THE AUTHOR

...view details