కర్ణాటక కునిగల్ పట్టణ సమీపంలోని తమకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తమకూరు నుంచి యెడ్యూరు వెళ్తున్న కారు 75వ జాతీయ రహదారి వద్ద రోడ్డు డివైడర్‌కు ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో కారులోని ఆరుగురు మహిళలు, ఓ వ్యక్తి మరణించారు. మరో ఏడుగురు క్షతగాత్రులయ్యారు. వీరిని హుటాహుటిన తమకూరు తాలూకా ఆసుపత్రికి తరలించారు.