తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ వీడియో: కారుపైకి దూసుకొచ్చిన మరో కారు - కర్ణాటక మంగళూరులో డ్రైవర్ మూర్ఛపోవడం వల్ల కారు ప్రమదం

కర్ణాటక మంగళూరులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు మరో కారును ఢీకొట్టింది. డ్రైవర్​ ఆకస్మాత్తుగా మూర్ఛపోవడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి.

లైవ్​ వీడియో: కారుపైకి దూసుకొచ్చిన మరో కారు

By

Published : Nov 12, 2019, 1:09 PM IST

లైవ్​ వీడియో: కారుపైకి దూసుకొచ్చిన మరో కారు
కర్ణాటక మంగళూరు నవభారత్ సర్కిల్‌లో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​​ అకస్మాత్తుగా మూర్ఛపోవటం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
మూర్ఛపోయిన డ్రైవర్​తో పాటు ఓ పాదచారుడు, పానీపూరీ బండి యజమానికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవరుపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details