తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా హాట్​స్పాట్​కు వెళ్లారని ఇంట్లోకి నో ఎంట్రీ! - landlord in Balasore cancer patient

కరోనా హాట్​స్పాట్​కు వెళ్లి వచ్చిన క్యాన్సర్ బాధితుడి పట్ల తన ఇంటి యజమాని అమానవీయంగా ప్రవర్తించాడు. ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అధికారులు యజమానికి నచ్చజెప్పి.. ఇంట్లోకి వెళ్లేలా ఒప్పించారు.

A cancer patient in balasore
బాలాసోర్

By

Published : Apr 17, 2020, 12:17 PM IST

కరోనా వైరస్ భయాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి భయాలతోనే ఒడిశాలోని బాలాసోర్​లో ఓ కుటుంబాన్ని లోపలికి రాకుండా ఇంటి యజమాని అడ్డుకున్నాడు. దీంతో 8 గంటలకుపైగా వారందరూ తమ ఇంటి బయటే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బాధితులు

జరిగింది ఇదీ

బాలాసోర్​కి చెందిన ఓ వ్యక్తి క్యాన్సర్ చికిత్స నిమిత్తం భువనేశ్వర్​కు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం స్వస్థలానికి తిరిగివచ్చారు. దేశంలోని కొవిడ్ హాట్​స్పాట్​లలో భువనేశ్వర్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చిన ఆ కుటుంబాన్ని ఇంటి యజమాని అడ్డుకున్నాడు. ఇంట్లోకి రాకుండా ఆపేశాడు.

బాధిత కుటుంబం ఉండే ఇల్లు

అనంతరం అధికారులు రంగంలోకి దిగారు. ఇంటి యజమానితో మాట్లాడి క్యాన్సర్ బాధితుడు సహా అతని భార్యను ఇంట్లోకి అనుమతించే విధంగా ఒప్పించారు. అయితే ఇద్దరు కుమారులు మాత్రం బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

నివాస ప్రాంతానికి చేరుకున్న అధికారులు

యజమాని అడ్డుకోవడం వల్ల 7-8 గంటలు ఇంటి వెలుపలే వారంతా వేచి చూశారని బాలాసోర్ తహసీల్దార్ పేర్కొన్నారు. అవసరమైతే ఈ అమానవీయ ఘటనపై బాధితులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సూచించారు.

బాధితులు

ABOUT THE AUTHOR

...view details