ఆదివారం ఎమ్మెల్యే జెనా భువనేశ్వర్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. నిబంధనలను సక్రమంగా పాటించిన వారికి ధన్యవాదాలు చెబుతూ చాక్లెట్లు, పుష్పాలు అందించారు. ఆ సమయంలో జెనా వాహనం నో పార్కింగ్ జోన్లో నిలిపి ఉంచడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే 500 రూపాయలు జరిమానా విధించారు.
నిబంధనలు పాటించమని చెప్పిన ఎమ్మెల్యేకే జరిమానా! - odisha
ఓ శాసనసభ్యుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వచ్చారు. కానీ... అదే సమయంలో ఆయనకు పోలీసులు జరిమానా విధించారు. శాసనసభ్యుడు కారును నో పార్కింగ్ జోన్లో నిలపడమే ఇందుకు కారణం.
నిబంధనలు పాటించమని చెప్పిన ఎమ్మెల్యేకే జరిమానా!
"నా కారు డ్రైవర్ వాహనాన్ని తప్పుగా పార్క్ చేశారు. చట్టం అందరికీ ఒకటే. అందుకే నాకు జరిమానా విధించారు. మనం ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి."
-అనంత నారాయణ్ జెనా, ఎమ్మెల్యే
ఇదీ చూడండి:శునకాలను చంపి.. రోడ్లపై కుప్పలుగా విసిరేశారు
Last Updated : Sep 29, 2019, 11:58 PM IST