ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదిన వేడుకలను గుజరాత్‌లోని సూరత్ ప్రజలు అంగరంగ వైభవంగా జరిపారు. అర్ధరాత్రి 12 గంటలకు 70 అడుగుల పొడవైన 700 కేజీల కేక్ కట్ చేశారు. సూరత్‌లోని ఇన్ఫర్మేషన్ బేకరీ ఈ కేక్‌ను తయారు చేసింది.
700 కిలోల కేక్‌తో మోదీ పుట్టినరోజు వేడుక - ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి భాజపా వర్గాలు. కొన్ని చోట్ల ప్రజలు మోదీకి వినూత్న రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో 700 కేజీల కేక్, బాణసంచా మెరుపులతో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
700 కిలోల కేక్‌తో మోదీ పుట్టినరోజు వేడుక
దుమాస్ ప్రాంతంలోని వై జంక్షన్ దగ్గర నిన్న సాయంత్రం సంగీత విభావరి నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. సొంతగడ్డపై మోదీ జన్మదినాన్ని ఓ వేడుకలా చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పేల్చిన బాణసంచా చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
Last Updated : Sep 30, 2019, 11:13 PM IST
TAGGED:
MODIS BIRTHDAY CELEBRATIONS