తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో మరో 'ఇడ్లీ బామ్మ'.. పేదలకు ఉచితం - ఈ హోటల్లో ఇడ్లీలు ఉచితం

ఆకలితో ఉన్న నిరుపేదలకు తన హోటల్లో ఉచితంగా కడుపునిండా టిఫిన్​ పెడుతోంది తమిళనాడు రామేశ్వరంలోని ఓ బామ్మ. మామూలుగా ప్లేట్​ ఇడ్లీ రూ.30 తీసుకున్నప్పటికీ.. పేదలకు మాత్రం ఇక్కడ ఉచితం.

తమిళనాడులో మరో 'ఇడ్లీ బామ్మ'.. పేదలకు ఉచితం

By

Published : Sep 15, 2019, 3:28 PM IST

Updated : Sep 30, 2019, 5:14 PM IST

తమిళనాడులో మరో 'ఇడ్లీ బామ్మ'.. పేదలకు ఉచితం

తమిళనాడులో రూపాయికి నాలుగు ఇడ్లీలు అమ్ముతూ అందరి ఆకలి తీరుస్తున్న కమలత్తాళ్​ బామ్మ కథ మరువక ముందే మరో ఇడ్లీ బామ్మ వెలుగులోకి వచ్చింది. రామేశ్వరంలోని అగ్ని తీర్థం దగ్గర రాణి అనే 70 ఏళ్ల బామ్మ ఎన్నో సంవత్సరాల నుంచి హోటల్​ నడుపుతోంది.

సాధారణంగా ప్లేట్​ ఇడ్లీకి రూ.30 తీసుకుంటోంది. అయితే పేదలకు మాత్రం ఇక్కడ టిఫిన్​ ఉచితం. కేవలం వ్యాపారం కోసం హోటల్​ నడపడం లేదని.. ఎవరి దగ్గరైనా డబ్బు లేకపోతే ఉచింతంగా టిఫిన్​ పెడతామని తెలిపింది. ఇప్పటికీ పుల్లల పొయ్యి మీదే వంట చేస్తూ.. నలుగురి ఆకలి తీరుస్తోంది ఈ బామ్మ.

Last Updated : Sep 30, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details