తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2020, 6:14 AM IST

ETV Bharat / bharat

ఆ పుస్తకంతో నాలుగో తరగతి విద్యార్థిని అరుదైన ఘనత

చిన్న వయసులోనే పుస్తకాన్ని రాసి.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది కర్ణాటకకు చెందిన మాన్య. ఈ జూనియర్ రచయిత 'పుటాణి సంరక్షకర' పుస్తకాన్ని రాసి, ఈ అరుదైన ఘనత సాధించింది. ఇంతకూ ఆ పుస్తకంలో ఏముందో తెలుసా!

A 4th standard student does name in India Book of Record
నాలుగో తరగతి విద్యార్థినికి అరుదైన ఘనత

నాలుగో తరగతి విద్యార్థినికి అరుదైన ఘనత

కర్ణాటక బెంగళూరుకు చెందిన మాన్య ఓ పుస్తకాన్ని రాసి.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకుంది. ఆ చిన్నారి నాలుగో తరగతే చదువుతోంది. ఆ వయసులో పెద్దగా పదాలపై పట్టు కూడా ఉండదు. అలాంటి చిన్నారి.. 'పుటాణి సంరక్షకర' పుస్తకాన్ని రాసి, ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

హర్ష, చిత్రా దంపతుల కుమార్తె మాన్య. చదువులో ముందంజలో ఉండే చిన్నారి.. ఇతర అంశాల్లోనూ అపారమైన ప్రతిభ కనబరుస్తుంది. అంతే కాదు మాతృభాష కన్నడ అంటే ఎంతో ఇష్టమని మాన్య చెబుతుంది.

తాను రాసిన బుక్​ని చూపిస్తున్న చిన్నారి మాన్య

పుస్తకంలో ఏముంది!

మాన్య.. రాసిన 'పుటాణి సంరక్షకర'లో కన్నడ సాహిత్యంతో పాటు కరోనా లాక్​డౌన్​లో చిన్నారుల భావాల గురించి పలు అంశాలు పొందుపరిచింది. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న నీటి సమస్యను.. చిత్రాలతో సహా ఎంతో చాకచక్యంగా ఈ పుస్తకంలో వివరించింది మాన్య. ఇంత చిన్న వయసులో సామాజిక సమస్యలపై అవగాహన ఉండటం, వాటికి అక్షర రూపం ఇవ్వడమనేది విశేషం.

ఆలోచనలకు అక్షరరూపం ఇస్తూ...

ఈ జూనియర్​ రచయిత రాసిన తొలి పుస్తకం... 'నేచర్​ ఈజ్​ అవర్​ ఫ్యూచర్​'. అంతేకాదు ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో మాన్య గ్రాండ్​ మాస్టర్ కూడా​.

ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్​ పతకాన్ని ముద్దాడుతున్న చిన్నారి...

ఇదీ చదవండి:వావ్​ తనీషా.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట

ABOUT THE AUTHOR

...view details