తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుడిలో 40 ఏళ్ల మహిళపై గ్యాంగ్​ రేప్​  ​ - badaun rape case

యూపీ బదాయూలో జరిగిన పాశవిక ఘటన మరువక ముందే తమిళనాడులో అలాంటి ఘటనే వెలుగు చూసింది. నాగపట్టిణంలో 40 ఏళ్ల మహిళను గుడిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మైనర్లపై అత్యాచారానికి పాల్పడ్డారు మృగాళ్లు.

A 40-year-old widow working as   a construction labourer in Nagapattinam was allegedly gang- raped in a temple police said on Friday.
తమిళనాడు గుడిలో 40ఏళ్ల మహిళపై గ్యాంగ్​ రెేప్​

By

Published : Jan 8, 2021, 6:03 PM IST

Updated : Jan 8, 2021, 8:05 PM IST

దేశంలో అత్యాచార ఘటనలు ఆగడం లేదు. ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ హత్యాచారం మరువక ముందే తమిళనాడు నాగపట్టిణంలో మరో పైశాచిక ఘటన జరిగింది. 40 ఏళ్ల మహిళను గుడిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు మృగాళ్లు. గురువారం రాత్రి సమయంలో తన సోదరి ఇంటికి ఒంటరిగా వెళ్తున్న మహిళను కత్తితో బెదిరించి గుడిలోకి లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె దగ్గరున్న నగదును దోచుకుని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి పారిపోయారు.

ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుడిలో స్పృహతప్పి పడిపోయి ఉన్న మహిళను స్థానికులు అస్పత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఇద్దరు నిందితులు మద్యం సేవించి ఉన్నట్లు బాధితురాలు చెప్పిందని వెల్లడించారు. ఆమె వితంతువు అని, భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తోందని తెలిపారు.

యూపీలో ఆగని దారుణాలు..

యూపీ బదాయూలో మరో రేప్ ఘటన జరిగింది. 15ఏళ్ల బాలికవై పొరుగింటి వ్యక్తే అత్యాచారం చేశాడు. బుధవారం రాత్రి గుడి నుంచి తిరిగివెళ్తున్న చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధిత కుటంబం ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

గుడికి వెళ్లిన తమ కూతురు ఇంటికి తిరిగి రాలేదని వెతుకుతుండగా పొరుగింట్లో కన్పించిందని తల్లిదండ్రులు తెలిపారు. వీర్​ పాల్​ అనే వ్యక్తి రేప్​ చేయగా.. అతని సోదరుడు పింటు ఇంటి బయట కాపలాగా ఉన్నట్లు బాలిక పోలీసులకు చెప్పింది. నిందితుడు పాల్​ను అరెస్టు చేయగా.. పింటు పరారీలో ఉన్నాడు.

11ఏళ్ల చిన్నారిపై..

యూపీలోని షాజహాన్​పుర్​లో 11ఏళ్ల మైనర్​పై గురువారం సాయంత్రం అత్యాచారం జరిగింది. ఒంటరిగా ఉన్న చిన్నారిని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి రేప్​ చేశాడు రమేశ్ అనే వ్యక్తి. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిద్రిస్తున్న బాలికపై..

యూపీ ముజఫర్​పుర్​లోని మలీర్​ గ్రామంలో 12ఏళ్ల చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పొరుగింటి వ్యక్తి అత్యాచారం చేశాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనిల్ కపేర్వన్​ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

తుపాకీతో బెదిరించి..

యూపీ మురాదాబాద్​లో 19ఏళ్ల పాఠశాల విద్యార్థినిని తుపాకీతో బెదిరించి పొరుగింటి వ్యక్తే అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఘటన అనంతరం అరిచేందుకు ప్రయత్నించిన విద్యార్థినిని మిద్దెపై నుంచి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత పోలీసులు ఎఫ్​ఐఆర్​లో రేప్ అభియోగాలు మోపలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

బాధితురాలు చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిందని, తనపై పొరిగింటి వ్యక్తి అరవింద్​ సింగ్​ అత్యాచారానికి పాల్పడినట్లు వాంగ్మూలం ఇచ్చాక ఎప్​ఐఆర్​లో రేప్​ అభియోగాలు జత చేశామని ఎస్​ఎస్​పీ ప్రభాకర్ చౌదరి తెలిపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఇదీ చూడండి: 'బదాయూ' నిందితుడి కోసం ప్రత్యేక టాస్క్​ఫోర్స్​

Last Updated : Jan 8, 2021, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details