తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: 8 రోజుల్లో 1,800 కి.మీ సైకిల్​పై..! - india corona news

లాక్​డౌన్​ కారణంగా మహారాష్ట్రలో చిక్కుకున్న ఓ యువకుడు ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. అంతే తన దగ్గరున్న సైకిల్​పై ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. 8 రోజుల్లో ఏకంగా 1,800 కిలోమీటర్లు తొక్కుకుంటూ ఒడిశా చేరుకున్నాడు.

A 20 years old Boy Mahesh Jena who has been working as a migrant laborer at Maharastra cycled about 1800 kms from Sangli-Miraj in Maharashtra to Odisha's Jajpur district.
కరోనా ఎఫెక్ట్​: 8 రోజుల్లో 1,800 కి.మీ సైకిల్​పై..!

By

Published : Apr 12, 2020, 3:37 PM IST

Updated : Apr 12, 2020, 4:01 PM IST

కరోనా ఎఫెక్ట్​: 8 రోజుల్లో 1,800 కి.మీ సైకిల్​పై..!

దేశంలో లాక్​డౌన్ విధించినప్పటి నుంచి రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించిపోయింది. అన్ని సంస్థలు, ఫ్యాక్టరీలు మూసేయడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి.. నిరాశతో స్వస్థలాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలానే ఉపాధి కోల్పోయిన ఓ యువకుడు ఎలాగైనా తన ఇంటికి వెళ్లాలనుకున్నాడు. వెంటనే సైకిల్​ తీసి ప్రయాణాన్ని మొదలు పెట్టి, ఏకంగా 1,800 కిలోమీటర్లు​ తొక్కుకుంటూ గమ్యాన్ని చేరుకున్నాడు.

అసలేమైంది?

మహేశ్​ జెన అనే యువకుడు మహారాష్ట్రలో వలసకూలీగా పనిచేస్తున్నాడు. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ప్రకటించడం​ వల్ల యువకుడు పని చేస్తోన్న ఫ్యాక్టరిని ఐదు నెలల పాటు మూసేశారు. పని లేకుండా జీవనం సాగించడం కష్టమని భావించి రెండు నెలల క్రితం కొన్న సైకిల్​పై తన ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మహేశ్​.

అలా 8 రోజుల్లో మహారాష్ట్ర నుంచి 1800 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశాలోని జైపుర్​కు చేరుకున్నాడు. రెండు మూడు చోట్ల పోలీసులు ఆపినప్పటికీ.. యువకుడి పరిస్థితిని చూసి అనుమతించారు. మధ్యమధ్యలో ఆలయాలు, రోడ్ల పక్కన విశ్రాంతి తీసుకుంటూ, ఎన్​జీఓ సంస్థలు అందించిన ఆహారంతో ఆకలి తీర్చుకున్నాడు.

జైపుర్ చేరుకున్న తర్వాత అక్కడి అధికారులు యువకుడికి ప్రాథమిక చికిత్స కోసం క్వారంటైన్​ కేంద్రానికి పంపించారు. 14 రోజుల పర్యవేక్షణ అనంతరం ఇంటికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Last Updated : Apr 12, 2020, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details