రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని అత్యాచారానికి గురైన 12ఏళ్ల బాలిక.. ఉమ్మెద్ ఆసుపత్రిలో ఓ బాలుడికి జన్మనిచ్చింది.
ఆరో తరగతి చదువుతున్న ఆమెపై తొమ్మిది నెలల క్రితం పొరుగున ఉన్న 30ఏళ్ల కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడగా గర్భం దాల్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తన మొబైల్ ఫోన్ చూపిస్తానని ఆశ చూపి బాలికపై దారుణానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు.
ఆ దుర్ఘటన తర్వాత బాలిక ఆరోగ్యం క్షీణించగా.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే అక్కడ వైద్యులు మరో ఆసుపత్రి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బాలికపై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య