గుజరాత్ సూరత్‌కు చెందిన దేవనా దేవ్ అనే పదేళ్ల బాలిక వయసులో చిన్నదే అయినా... మనసులో, ఆలోచనల్లో చాలా గొప్పది. క్యాన్సర్ బాధితులకు జుట్టును దానం చేయాలనుకుంది దేవ్. అనుకున్నదే తడవుగా తాను పుట్టినప్పటి నుంచి పెంచుకున్న 30 అంగుళాల పొడువైన జట్టును ఓ క్యాన్సర్ బాధితురాలకు దానం చేసింది.
క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల కోసం జరుగుతున్న 'బాల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యాంపెయిన్‌లో కూడా దేవా పాల్గొంటుంది. రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించిన దేవ్... అకస్మాత్తుగా క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు దానం చేయాలని నిర్ణయించుకుంది. ధారావాహికల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా... దృఢమైన నిర్ణయంతో వాటిని లెక్కచేయలేదు.