తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో కరోనా రికార్డు - ఒక్కరోజే 17,433 కేసులు - భారత్​లో కొవిడ్​ కేసులు

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్​ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే దేశంలో మొత్తం కేసుల సంఖ్య 37 లక్షల 69 వేలు దాటింది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లోనే విపరీతంగా కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 17,433 మందికి పాజిటివ్​గా తేలింది.

9,860 new COVID-19 cases, 113 deaths in Karnataka
కర్ణాటకలో కరోనా పంజా- ఒక్కరోజే 9,860 కేసులు

By

Published : Sep 2, 2020, 8:13 PM IST

Updated : Sep 2, 2020, 9:12 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 17,433 మందికి వైరస్​ సోకింది. మరో 292 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షల 25వేలు దాటగా... 25,195 మంది మరణించారు.

కర్ణాటకలో ఉద్ధృతంగా కరోనా..

కర్ణాటకలో కొత్తగా 9 వేల 860 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 113 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,341కు చేరగా.. మృతుల సంఖ్య 5,950కి పెరిగింది.

తమిళనాడులో 6వేలు

తమిళనాడులో గత కొన్ని రోజులుగా రోజూ 6వేలకు చేరువలోనే కొవిడ్ ​కేసులు బయటపడుతున్నాయి. తాజాగా 5,990 మంది కరోనా బారినపడగా... మరో 98 మంది చనిపోయారు. ఇప్పటివరకు 3 లక్షల 80 వేల మందికి పైగా వైరస్​ను జయించారు.

యూపీలో 5 వేలకు పైనే..

ఉత్తర్​ప్రదేశ్​లో రోజూ 5వేలకు పైనే కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 5,716 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 74 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 41 వేలు దాటింది.

రాష్ట్రాలవారీగా కరోనా కేసులు
  • దిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 2,509 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 19 మంది మృత్యువాత పడ్డారు.
  • కేరళలో కొత్తగా 1,547 మందికి వైరస్​ సోకింది. మరో ఏడుగురు మృతిచెందారు. అయితే రాష్ట్రంలో కొత్త కేసుల కంటే రికవరీ ఎక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,129 మంది కోలుకున్నారు.
  • పంజాబ్​లో తాజాగా 1,514మంది వైరస్​ బారిన పడగా.. మొత్తం కేసుల సంఖ్య 56,989కి పెరిగింది.
  • గుజరాత్​లో కొత్తగా 1,305 కేసులు నమోదవగా.. మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువైంది.
  • జమ్ముకశ్మీర్​లో ఒక్కరోజే 641 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది.
    రాష్ట్రాల వారీగా కొవిడ్ వివరాలు

మరణాల రేటులో క్షీణత..

దేశంలో ఓవైపు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ... రికవరీలు పెరుగుతున్నాయి. మరణాల రేటు క్షీణించడమూ కాస్త ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం కొవిడ్ మరణాల రేటు 1.76 శాతానికి తగ్గింది. ఇది ప్రపంచ సగటు 3.3 శాతంతో పోల్చుకుంటే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 29 లక్షల మందికి పైగా వైరస్​ నుంచి కోలుకోగా... రికవరీ రేటు 76.98 శాతం(77)కు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:రైతులు, కూలీల మృత్యుఘోష- 43 వేల మంది ఆత్మహత్య

Last Updated : Sep 2, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details