తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో భాగస్వామ్యమైన 2550మంది విదేశీయులను పదేళ్లపాటు భారత్‌లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. పర్యటక వీసాపై దేశంలోకి వచ్చి.. అనుమతి లేకుండా దిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్లో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. అందులో పాల్గొన్నవారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా రావడం కలకలం రేపింది.
తబ్లిగీ జమాతే విదేశీయులపై పదేళ్ల పాటు నిషేధం - తబ్లిగీ జమాత్ సభ్యులు
తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో పాలు పంచుకున్న 2550 మంది విదేశీయులపై భారత్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం పదేళ్ల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు. దేశంలో కరోనా విజృంభణకు కారణమైనందున ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
తబ్లిగీ జమాత్ సభ్యులపై పదేళ్ల పాటు నిషేదం
ఈ సమావేశాలే దేశంలో వైరస్ వ్యాప్తికి కేంద్రబిందువులుగా నిలిచాయి. ఈ మేరకు తబ్లిగీ జమాతే కార్యక్రమాల్లో పాల్గొన్న.. 2550 మందికిపైగా విదేశీయులను కేంద్రం బ్లాక్ లిస్టులో పెట్టింది. వారిని పదేళ్లపాటు దేశంలోకి రాకుండా నిషేధం విధించింది.
ఇదీ చూడండి:గుజరాత్లో కాంగ్రెస్‌కు షాక్... ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Last Updated : Jun 4, 2020, 5:42 PM IST