తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విలయం- ఒక్కరోజులో 9,518 కేసులు - viru case karnataka

9518-new-number-covid19-positive-cases-258-deaths-and-3906-discharged-in-maharashtra-today
'మహా' విలయం- ఒక్కరోజులో 9,518 కేసులు

By

Published : Jul 19, 2020, 8:34 PM IST

Updated : Jul 19, 2020, 8:59 PM IST

20:31 July 19

'మహా' విలయం- ఒక్కరోజులో 9,518 కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో 9,518 కేసులు బయటపడ్డాయి. మరో 258మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,10,455కు చేరగా.. మరణాల సంఖ్య 11,858కు పెరిగింది. అయితే తాజాగా 3,906మంది వైరస్​ను జయించి ఇళ్లకు చేరారు.

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో కొత్తగా 1,046కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో ఇప్పటివరకు 1,01,224మంది వైరస్​ బారినపడ్డారు. 64 తాజా మరణాలతో మొత్తం 5,711మంది వైరస్​కు బలయ్యారు. ముంబయిలో ప్రస్తుతం 23,828 యాక్టివ్​ కేసులున్నాయి.

కర్ణాటకలో...

కర్ణాటకలో వైరస్​ విజృంభిస్తోంది. తాజాగా 4,120కేసులు నమోదు కాగా.. వీటిలో 2,156కేసులు కేవలం బెంగళూరుకే చెందినవి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 63,772మందికి వైరస్​ సోకింది. 91 తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 1,331కు చేరింది.  

గుజరాత్​లో...

గుజరాత్​లో తాజాగా 965 కేసులు వెలుగుచూశాయి. మరో 20మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 48,441మందికి వైరస్​ సోకింది. 2,147మంది వైరస్​కు బలయ్యారు.

అయితే గుజరాత్​లో ప్రస్తుతం 11,412 యాక్టివ్​ కేసులున్నాయి. 34,882మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. 

Last Updated : Jul 19, 2020, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details