తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రామిక్ స్పెషల్​తో.. 11 లక్షల మంది సొంత గూటికి!

లాక్​డౌన్​ వేళ వలస కార్మికుల కోసం నడుపుతున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లు.. దాదాపు 11 లక్షల మందిని సొంతూళ్లకు చేర్చాయి. ఇకపై రోజుకు 100 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

932 'Shramik Special' trains operated so far, over 11 lakh migrants ferried home
శ్రామిక్ స్పెషల్​తో.. 11 లక్షలమంది సొంత గూటికి!

By

Published : May 15, 2020, 5:05 PM IST

దేశవ్యాప్తంగా 'శ్రామిక్ స్పెషల్' రైళ్ల ద్వారా ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మంది.. సొంతూళ్లకు చేరుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్​కు..

లాక్​డౌన్​ కారణంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం... శ్రామిక్​ స్పెషల్​ పేరిట మొత్తం 932 ప్రత్యేక రైళ్లు నడిపింది భారత రైల్వే. మే 1న ప్రారంభమైన ఈ సర్వీసులను ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ సహా 19 రాష్ట్రాల్లోని 11 లక్షల కార్మికులు వినియోగించుకున్నారు. ఒక్కో రాష్ట్రానికి సరిపడా రైళ్లను కేటాయించగా... అత్యధికంగా ఉత్తర్​ప్రదేశ్​కు 487 రైళ్లను అందుబాటులో ఉంచింది కేంద్రం.

రోజూ 100 రైళ్లు పక్కా..!

ప్రయాణికులకు స్క్రీనింగ్​ నిర్వహించి.. ఉచిత భోజనం, మంచి నీటి సదుపాయం కల్పించింది రైల్వే. ఇప్పటి వరకు ఒక్క ట్రైన్​లో కేవలం 1200 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతించింది. గత సోమవారం నుంచి 1700 మందికి ప్రయాణించే అవకాశం కల్పించింది. శుక్రవారం ఒక్కరోజే 145 రైళ్లు నడిపినట్లు వెల్లడించిన రైల్వే శాఖ.. ఇకపై ప్రతిరోజు 100 రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అయితే, ఈ సేవలకు మొత్తం ఎంత ఖర్చవుతుందో అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఒక్క సర్వీసుకు సుమారు రూ. 80 లక్షలు ఖర్చవుతున్నట్లు సమాచారం. ఈ మొత్తంలో 85 శాతం కేంద్రం భరిస్తే, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంది.

ఇదీ చదవండి:వలస తల్లి కుమారుడికి 'సూట్​కేస్​' రథమైంది!

ABOUT THE AUTHOR

...view details