జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతను భారత సైన్యం తీవ్రంగా పరిగణించింది. 6 నెలల కన్నా తక్కువ వ్యవధిలోనే 93మంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నారు.
"జూన్ 8 ఉదయం నాటికి.. జమ్ముకశ్మీర్‌లో 93మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గత రెండు రోజుల్లో తొమ్మిది మంది ముష్కరులు మృతిచెందగా.. మన జవాన్లలో ఒక్కరు కూడా ప్రాణాలు వీడలేదు."
-- భారత సైన్యం.
కశ్మీర్లో ఉగ్రవాద బృందాల ఏరివేత, నియంత్రణ రేఖ వెంబడి అక్రమ చొరబాట్లను అడ్డుకునే కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
టాప్ ఉగ్ర నేతలు రియాజ్ నైకూ, జునైద్ సెహ్రాయ్ సహా జైషే మహ్మద్, లష్కరే తోయిబా, పాకిస్థాన్ రూపొందించిన రెసిస్టెన్స్ ఫోర్స్‌లోని అనేక మంది విదేశీ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.