తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ లోయలో 90 శాతం ఆంక్షలు ఎత్తివేశాం'

జమ్ము కశ్మీర్​లో క్రమంగా ఆంక్షలను తొలగిస్తున్నారు. లోయలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు 90 శాతం ఆంక్షలు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు.

By

Published : Sep 2, 2019, 8:59 PM IST

Updated : Sep 29, 2019, 5:17 AM IST

జమ్ము కశ్మీర్

కశ్మీర్​ లోయ

కశ్మీర్‌ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొనడం వల్ల 90 శాతం వరకూ పగటిపూట ఆంక్షలు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. అయినా జనసంచారంలో పెద్దగా మార్పులు రావటం లేదు.

వరుసగా 29వ రోజు కశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, విద్యాసంస్థలు, ప్రజా రవాణా నిలిచిపోయాయి. కశ్మీర్‌ లోయలో చాలాప్రాంతాల్లో బ్యారికేడ్లు ఎత్తివేశామన్న అధికారులు భద్రతా బలగాల మోహరింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 76 టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ల పరిధిలో ల్యాండ్‌ లైన్‌ సేవలను పునరుద్ధరించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనందున కశ్మీర్‌ లోయలో 105 పోలీస్‌ స్టేషన్లు ఉండగా 82 ఠాణాల పరిధిలో పగటిపూట ఆంక్షలు ఎత్తివేసినట్లు అధికారులు ప్రకటించారు. చరవాణి, అంతర్జాల సేవలపై సస్పెన్షన్‌ కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: హీరో 2.0: వినువీధుల్లో అభినందనుడి విన్యాసం

Last Updated : Sep 29, 2019, 5:17 AM IST

ABOUT THE AUTHOR

...view details