తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ 90మంది వైద్యులకు కరోనా - చెన్నై ప్రభుత్వాసుపత్రి

చెన్నైలోని రాజీవ్​ గాందీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. అయితే వీరిలో వైరస్​ రోగులకు చికిత్స అందించినవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు తెలిపారు.

90 doctors at Chennai hospital test Covid-19 positive
ఆ 90మంది వైద్యులకు కరోనా నిర్ధరణ

By

Published : Jun 14, 2020, 11:14 AM IST

తమిళనాడులో కరోనా వైరస్​ రోజురోజుకూ విజృంభిస్తోంది. చికిత్స అందించే వైద్యులు కూడా వైరస్​ బారినపడుతున్నారు. తాజాగా చెన్నైలోని రాజీవ్​ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 90మంది వైద్యులకు వైరస్​ సోకినట్టు ఓ అధికారి తెలిపారు.

"10రోజుల వ్యవధిలో 80-90మంది వైద్యులకు కరోనా పాజిటివ్​గా తేలింది. వీరిలో చాలా తక్కువమంది డాక్టర్లు.. కరోనా బాధితులకు చికిత్స అందించారు. మిగిలిన వారు వివిధ విభాగాలకు చెందినవారు."

-- అధికారి.

ఆసుపత్రిలో వైద్యుల కొరత వల్ల.. దాదాపు 300మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు.

తాము సరిగ్గా తిని, నిద్రపోయి.. 3 నెలలయ్యిందని, కుటుంబసభ్యులతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదని అధికారి పేర్కొన్నారు. వాట్సాప్​, ఇతర సాంకేతికతతోనే కుటుంబ సభ్యులను చూస్తున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:-కరోనా బాధితుల్లో ఉండే 8 ప్రధాన లక్షణాలివే

ABOUT THE AUTHOR

...view details