తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత సైన్యం కీలక విజయం​- 9 మంది ఉగ్రవాదులు హతం - latest encounter news

terrorists-killed-by-indian-army
భారత సైన్యం భారీ ఆపరేషన్​

By

Published : Apr 5, 2020, 10:29 AM IST

Updated : Apr 5, 2020, 2:58 PM IST

10:48 April 05

ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్​లో భారత్​ సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్​లో మొత్తం ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. 

10:26 April 05

భారత సైన్యం భారీ ఆపరేషన్​- 9 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యం కీలక విజయం సాధించింది. గత 24 గంటల్లో కశ్మీర్​ లోయలో 9 మంది ముష్కరుల్ని మట్టుబెట్టింది. 

దక్షిణ కశ్మీర్​ బట్​పురాలో శనివారం నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది హతమార్చారు. కేరన్ సెక్టార్​లో మరో ఐదుగురిని మట్టుబెట్టారు. వీరంతా నియంత్రణ రేఖ దాటి భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంటే నిలువరించి, కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

ఈ భారీ ఆపరేషన్​లో ఒక భారత జవాను అమరుడైనట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. హిమపాతం ఎక్కువగా ఉండటం వల్ల వీరిని ఆస్పత్రికి తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదన్నారు. 

Last Updated : Apr 5, 2020, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details