ఒడిశా బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. మరో 21మందికి చికిత్స అందిస్తున్నారు. గంజాం జిల్లాలోని గొలంతర ప్రాంతంలో 11కేవీ హై ఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి బస్సులో మంటలు చెలరేగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
ఒడిశా బస్సు ప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతులు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్టు స్పష్టం చేశారు.
ప్రమాద సమయంలో బస్సులో 40మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. వివాహ నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టి సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షిస్తారమని ఒడిశా రవాణామంత్రి పద్మనాభ బెహెరా వెల్లడించారు. అయితే ఓ ద్విచక్ర వాహనానికి దారి ఇస్తున్న సమయంలో బస్సుపైన ఉన్న లగేజ్ కారియర్.. విద్యుత్ తీగలకు తగిలినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.