తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగని 'కోటా' మరణాలు.. సమస్యకు పరిష్కారమేది!

రాజస్థాన్​లోని కోటాలో గత నెల చివరి రెండు రోజుల్లో 9మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో డిసెంబర్‌ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 100కు చేరింది. మొత్తంగా 2019లో 949మంది చిన్నారులు మరణించారు. ప్రభుత్వం పలు నష్ట నివారణ చర్యలకు దిగినప్పటికీ ఫలితం దక్కడం లేదు.

kota
100కు పెరిగిన 'కోటా' చిన్నారి మృతులు

By

Published : Jan 2, 2020, 6:51 AM IST

Updated : Jan 2, 2020, 7:01 AM IST

రాజస్థాన్​ కోటాలోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా డిసెంబర్​ 30-31 తేదీల్లో 9మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఆ నెలలో మృతిచెందిన చిన్నారుల సంఖ్య 100కు చేరింది.

కేవలం డిసెంబరు నెలలోనే ఈ ఆసుపత్రిలో 100 మంది చిన్నారులు మృతిచెందగా.. ఈ ఏడాది వీరి సంఖ్య 949 గా ఉంది. అయితే గతంతో పోల్చితే శిశు మరణాలు తగ్గాయని ఆసుపత్రి వర్గాలు చెప్పడం గమనార్హం. 2014లో గరిష్ఠంగా 1198మంది చిన్నారులు మృతి చెందారని అధికారులు వెల్లడించారు.

చిన్నారుల మరణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. పరిశుభ్రత, నూతన సౌకర్యాల కల్పన దిశగా నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోగా ఆక్సిజన్ సరఫరా లైన్​ను ఏర్పాటు చేయాలని వైద్య అధికారులు ఆదేశించారు. భాజపా పార్లమెంటరీ బృందం ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఈ ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడ్డారు.

'అపరిశుభ్రతే'-దర్యాప్తు నివేదిక

కోటా ఆసుపత్రిలో శిశుమరణాలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ గతంలో.. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. ఆసుపత్రి మౌలిక సదుపాయాల్లో అనేక లోపాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది ముగ్గురు సభ్యుల కమిటీ. చిన్నారులను ఉంచే నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(నవజాత శిశు విభాగం)లో సరిపడా ఆక్సిజన్‌ ఉండట్లేదని గుర్తించింది.

ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రతతో మునిగి తేలుతోందని, పందులు స్వైర విహారం చేస్తున్నట్లు జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్​సీపీసీఆర్) పేర్కొంది. విరిగిన తలుపులు,కిటికీలు, సిబ్బంది కొరతతో ఆసుపత్రి సమస్యల సుడిలో ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టం చేసింది. వైద్య పరికరాలు తక్కువై వైద్యానికి అవసరమైన పరికరాలు కూడా ఆసుపత్రిలో అంతంతమాత్రంగానే ఉన్నట్లు వెల్లడించింది.

పెద్ద దిక్కు.. అయినా

కోటా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పిల్లల పరిస్థితి విషమంగా ఉంటే స్థానిక వైద్యులు ఈ ఆసుపత్రినే సూచిస్తారు. ఈ విధంగా విషమంగా ఉన్న వారితో సహా రోజూ చాలా మంది చిన్నారులను వైద్యం కోసం ఇక్కడకు తీసుకొస్తారు. అలాంటి ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు, సదుపాయాలు లేకపోవడం అధికారుల నిర్వహణ లోపానికి అద్దం పడుతోంది.

ఆగని 'కోటా' మరణాలు.. సమస్యకు పరిష్కారమేది!

ఇదీ చూడండి: కోటా: ఒకే నెలలో 91మంది చిన్నారులు మృతి

Last Updated : Jan 2, 2020, 7:01 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details