ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. వీరంతా రాజస్థాన్ నుంచి బిహార్‌లోని తమ సొంత ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ ఘటనలో స్కార్పియో నుజ్జునుజ్జయింది.
స్కార్పియో, ట్రక్కు ఢీ- తొమ్మిది మంది మృతి - Pratapgarh road accident news
09:04 June 05
స్కార్పియో ట్రక్కు ఢీ- తొమ్మిది మంది మృతి
ఉదయం 6 గంటల సమయంలో నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాజిద్పుర్లో లఖ్‌నవూ-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు చెప్పారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు. కాసేపు అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినట్లు తెలిపారు.
ఉదయం భారీ వర్షం కురుస్తోన్న కారణంగా స్కార్పియోను డ్రైవర్ అదుపు చేయలేక పోయినట్లు పోలీసులు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.