తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో ఫంగస్​ ఇన్ఫెక్షన్​- 9 మంది మృతి - గుజరాత్

ఇటీవల దిల్లీలో బయటపడిన అరుదైన ఫంగస్​ ఇన్ఫెక్షన్​ ఇప్పుడు గుజరాత్​లోనూ వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. మ్యూకోర్మైకోసిస్​గా పిలిచే ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

9 dead in ahmedabad
మరో ప్రాణాంతక వ్యాధి

By

Published : Dec 19, 2020, 5:45 AM IST

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. మ్యూకోర్మైకోసిస్‌ అనే అరుదైన శిలీంధ్ర వ్యాధి కారణంగా అహ్మదాబాద్‌లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే దిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో ఈ వ్యాధి కేసులు బయటపడ్డాయి. ముంబయిలోనూ ఇలాంటికి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి :కరోనా రోగుల్లో ఇన్ఫెక్షన్- 15 రోజుల్లో 13 కేసులు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇప్పటివరకు 44 మంది ఈ వ్యాధి బారిన పడగా.. 9మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం దిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో 13 కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధికి గురైనవారంతా 50ఏళ్ల పైబడినవారే. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కన్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లోత్‌ కూడా మ్యూకోర్మైకోసిస్‌ గురించి చెబుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం గమనార్హం. 'కొవిడ్‌ 19 నుంచి కోలుకుంటున్నవారు మ్యూకోర్మైకోసిస్‌ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి. దీని వల్ల శరీరంలో మొదడుతో పాటు పలు అవయవాలు పనిచేయకుండా పోతాయి. ముంబయి, అహ్మదాబాద్‌ నగరాల్లో ఇప్పటికే దీనిపై హెచ్చరికలు చేశారు' అని గెహ్లోత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఏంటీ మ్యూకోర్మైకోసిస్‌..

ఈ వ్యాధిని గతంలో జైగోమైకోసిస్‌ అనేవారు. అత్యంత అరుదైన ఈ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ చాలా ప్రమాదకరమైనది. మ్యూకోర్మైసెటీస్‌ అనే శిలీంధ్రం కారణంగా ఈ ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. తొలుత ముక్కు నుంచి ప్రారంభమై.. కళ్లకు సోకుతుంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించడం వల్ల దీని నుంచి బయటపడొచ్చు. లేదంటే ప్రాణాంతకంగా మారుతుంది. ఇన్ఫెక్షన్‌ కళ్లను చేరిన తర్వాత కంటి చుట్టూ ఉండే కండరాలు పనిచేయకుండా పోతాయి. ఫలితంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. ఇక మెదడును చేరితే.. ఆ రోగి మెదడువాపు‌ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి :దిల్లీలో అగ్ని ప్రమాదం- ఇద్దరు చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details