భారత్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. మృతుల సంఖ్యలో మాత్రం ఏ మార్పు లేదు. తాజాగా 89,706 కేసులు నమోదయ్యాయి. మరో 1,115 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 43 లక్షల 70 వేలు దాటింది.
తగ్గుతున్న మరణాల రేటు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 34 లక్షల (33,98,844)మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో రికవరీ రేటు 77.77శాతానికి పెరిగింది. మరణాల రేటు క్రమంగా క్షీణంచి... 1.69కు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.