దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఈ నెల 14 తర్వాత కూడా లాక్డౌన్ను కొనసాగించడమే ఉత్తమమని ఓ సర్వేలో తేలింది. ఓ వార్తా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ, వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్డౌన్ సరైన మార్గమని 88% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ఆన్లైన్ సర్వేలో పాల్గొన్న 40 వేల మందిలో 92 శాతం మంది కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు రంగాలకు అనుమతివ్వాలని సూచించారు.
లాక్డౌన్ కొనసాగించాలని 88% మంది ఓటు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వచ్చే మంగళవారంతో ముగియనుంది. కానీ, దేశంలో కరోనా కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగించాలా? వద్దా? అని అడిగితే 88 శాతం మంది ప్రజలు ముక్తకంఠంతో పొడిగించాలనే కోరుతున్నారు.
లాక్డౌన్ కొనసాగించాలని 88% మంది ఓటు
ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ కాలాన్ని ఈ నెల 30 వరకు పొడిగించింది. విద్యాసంస్థలను జూన్ 17 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:'ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగింపు'