కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం తగ్గి వాయు నాణ్యత పెరిగింది. దేశంలోని 103 ప్రధాన నగరాలకు గాను 23 నగరాల్లో వాయునాణ్యత మెరుగుపడినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. మరో 65 నగరాల్లో సాధారణ స్థాయికి చేరినట్లు పేర్కొంది.
దేశ రాజధానిలో వృద్ధి
లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో గాలి కాలుష్యం అదుపులోకి వచ్చింది. ఎప్పుడూ ప్రమాదకర స్థాయిలో ఉండే గాలి నాణ్యత సూచీలు హరిత రంగులో దర్శనమిస్తున్నాయి. అందరూ ఇంట్లోనే ఉండాలన్న నినాదంతో పాటు ట్రాఫిక్ లేకపోవటం,పరిశ్రమలు మూతపడడం వల్ల మునుపెన్నడూ లేని స్థాయిలో దిల్లీలో గాలి నాణ్యత పెరిగింది.