తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో 86శాతం దొంగ కరోనా కేసులే

తమిళనాడులో లక్షణాలు లేని కరోనా కేసులు 86శాతం ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. వైరస్​ నియంత్రణలో భాగంగా అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

86 pc of COVID-19 cases in TN asymptomatic, says TN CM
'రాష్ట్రంలో 86శాతం దొంగ కరోనా కేసులు'

By

Published : Jun 7, 2020, 7:06 PM IST

తమిళనాడులో రోజురోజుకూ కరోనా బాధితులు అధికమవుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 86శాతం లక్షణాలు లేని కేసులున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు లాక్​డౌన్​ చర్యలు సాయపడ్డాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొవిడ్​ కేసులు ప్రారంభమైన ఫిబ్రవరి నాటి నుంచి తాము తీసుకుంటున్న చర్యలను పళనిస్వామి వివరించారు. విదేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తమిళనాడులో మరణాల రేటు తక్కువని వెల్లడించారు. మరోవైపు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగుపడినట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థపైనా దృష్టి సారించినట్టు వివరించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపించింది. ఈ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నాం. అనేక కొత్త పెట్టుబడులకు కూడా అవకాశం దొరికినట్లైంది.

పళనిస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి

జూన్​ 4 వరకు సుమారు 5.50 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 86శాతం మంది ఎసింప్టొమాటిక్​తో వైరస్ బారిన పడినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

నియంత్రణ దిశగా...

కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించినట్లు పళనిస్వామి వివరించారు. వైద్య, మౌళిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిధులు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. వైరస్​ ప్రయోగ కేంద్రాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆసుపత్రుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగాల కల్పన..

అంతేకాకుండా అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్​ తదితర దేశాల పెట్టుబడిదారులతో రూ.15వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. తద్వారా 47వేలమందికి ఉగ్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ప్రజలకు అండగా..

ఏప్రిల్​ నుంచి మూడు నెలల వరకు సుమారు 2 కోట్ల రేషన్​ కార్డు దారులకు ఉచితంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు పళనిస్వామి. నిరాశ్రయులు, వలస కార్మికులకు కమ్యూనిటీ కిచెన్​, అమ్మా క్యాంటిన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని వివరించారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని.. వైరస్​ను అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని పళనిస్వామి కోరారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 30వేలకుపైగా కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. 251మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం 16వేల మంది వైరస్​ నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details