ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగ్దల్పుర్ నగరంలో నివసించే విజయలక్ష్మి అరోరా(85సం'') గతంలో ఒక ఆయుర్వేద వైద్యుడిని పెళ్లాడింది. కొద్దిరోజులకే ఆమె భర్త మరణించారు. భర్త కాలంచెల్లిన తర్వాత జీవితాంతం ఆరోగ్యంగా బతకాలనుకున్నారు విజయలక్ష్మి. అందుకే, అప్పటినుంచి సైకిల్ తొక్కాలని నిర్ణయించుకున్నారు. రోజురోజుకూ సైకిల్‌కు దగ్గరయ్యారు. ఇలా 30 సంవత్సరాలుగా ప్రతిరోజు 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నారు. వయసురీత్యా మొదట్లో కోడలు, కుమారుడు సైకిల్ తొక్కొద్దని విజయలక్ష్మికి సూచించారు. అయితే, అవేవీ పట్టించుకోని బామ్మ... ఇప్పుడు అక్కడి వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు, ఆరోగ్యం పట్ల యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
85 ఏళ్ల వయసులో సైకిల్‌పై రోజూ 20 కి.మీ.! - బస్తర్
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగ్దల్‌పుర్‌లో 85 ఏళ్లు నిండిన విజయలక్ష్మి ఇప్పటికీ రోజూ 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతున్నారు. భర్త మరణాంతరం జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకే 30 ఏళ్లుగా సైకిల్ తొక్కుతున్నారావిడ.
85 ఏళ్లు నిండినా సైకిల్ని వదలని 'బామ్మ'
" నేటి తరం ప్రజలకు ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. సాంకేతిక సదుపాయాలతో ప్రజలు విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డారు. ఈ రోజుల్లో ప్రజలు ఎలాంటి వ్యాయామం చేయట్లేదు. అందుకే వారి రోగనిరోధకశక్తి తగ్గుతూ వస్తోంది."
- విజయలక్ష్మి, సైక్లింగ్ బామ్మ