కరోనా మహమ్మారి భారత్లో తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. లాక్డౌన్ కారణంగా విద్యాసంవత్సరమంతా ఇంట్లోనే గడిచింది. అందుకే ఈ కరోనా కాలంలో 85 శాతం మంది తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తు గురించి చింత పెరిగిందని ఓ సర్వే వెల్లడించింది.
నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్ధుల తల్లిదండ్రులపై ఓ సర్వే చేపట్టింది లీడ్ స్కూల్. 5 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో 70 శాతం మంది వారి పిల్లల విద్యాభ్యాసం గురించి చింతిస్తున్నారు. 78 శాతం మంది వారి పిల్లల ఆరోగ్యం గురించి, 40 శాతం మంది ఓ విద్యా సంవత్సరం కోల్పోతున్నారని బాధపడుతున్నారు.
"తల్లిదండ్రులు ఈ సమయంలోనే ఆచితూచి పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. తల్లిదండ్రులు పాఠశాలలను నమ్మి కలిసి ముందడుగు వేయాలి."