తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై సర్వే- జనం ఏం అనుకుంటున్నారంటే...

ప్రపంచం 6-12 నెలల్లో కరోనా మహమ్మారిని జయిస్తుందని.. ఓ సర్వేలో తేలింది. దాదాపు 84శాతం మంది ఏడాదిలోగా వైరస్​ను తరిమికొడతామని అభిప్రాయపడుతున్నట్లు స్పష్టమైంది.

coronavirus recovery
కరోనా వైరస్

By

Published : Apr 1, 2020, 8:13 AM IST

మరో 6-12 మాసాల్లో ప్రపంచంమంతా కొవిడ్​-19ను జయిస్తుందని 84 శాతం మంది దృఢంగా నమ్ముతున్నారు. మార్కెట్ పరిశోధన-విశ్లేషణ సంస్థ వెలోసిటీ ఎంఆర్​​​ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది.

ఎయిడ్స్​ కంటే ఎక్కువ భయం

మార్చి 19, 20 తేదీల్లో 2,100 మందిపై నిర్వహించిన ఈ ఆన్​లైన్​ సర్వే ప్రకారం.. ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్న వ్యాధుల జాబితాలో క్యాన్సర్, హెచ్ఐవీ/ఎయిడ్స్ కంటే ముందువరుసలో కరోనా ఉంది.

ఈ సర్వేలో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ.. 46శాతం మంది వివిధ పనులపై ప్రయాణాలు చేయడం మానలేకపోతున్నారు. మరో 71 శాతం మంది కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత కొన్ని రోజుల వరకు షేక్​హ్యాండ్​లు, కౌగిలింతల జోలికిపోమంటున్నారు. తాము పని చేసే సంస్థలు 'ఇంటి నుంచి పని' సదుపాయం కల్పించలేదని 25 శాతం మంది ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.

"మా సర్వేలో 81 శాతం మంది ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చేతులు పదే పదే కడుక్కోవడం అలవాటు చేసుకున్నారని తేలింది. మరో 78 శాతం మంది అనవసరంగా జనసమూహాలు ఉన్న ప్రదేశాల్లో తిరగడం ఆపేశారు. ఇక 72 శాతం మందైతే భవిష్యత్తులో విదేశీ యాత్రలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటామని తెలిపారు."

-జాసల్​ షా, వెలోసిటీ ఎంఆర్​ సీఈఓ

ఇదీ చదవండి:'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'

ABOUT THE AUTHOR

...view details