మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు - Covid 19 death toll in Karnataka
20:17 July 18
మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో మొత్తం కేసులు 3 లక్షలు దాటిపోయాయి. ఇప్పటివరకు 3,00,937మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా 8 వేల 348 మందికి వైరస్ సోకింది. మరో 144 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 11 వేల 596కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 5వేలమందికిపైగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
కర్ణాటకలో 4వేలకు పైనే..
కర్ణాటకలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజే 4,537 కేసులు నమోదయ్యాయి. 93మంది మరణించారు. ఫలితంగా మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 59,652కు చేరగా.. మృతుల సంఖ్య 1,240కు పెరిగింది. ఇప్పటివరకు 21,775 మంది డిశ్చార్జి అయ్యారు.