భారత్‌లో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 14,888 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 295 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసులు 7 లక్షల 19వేలకు చేరువలో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్ కేసులు విపరీతంగా బయటపడుతున్నాయి.
యూపీలో 2 లక్షలు దాటిన కేసులు..
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 5,898 మంది వైరస్ బారిన పడగా... 82 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.
తమిళనాడులో 6 వేలు..
తమిళనాడులో వైరస్ రికవరీ రేటు మెరగవుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 5,958 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 52,362 మంది చికిత్స పొందుతున్నారు.
- బంగాల్లో తాజాగా 2,974మందికి కరోనా సోకింది. మరో 55 మంది మరణించారు.
- కేరళలో కొత్తగా 2,476 మంది వైరస్ బారిన పడ్డారు.
- దిల్లీలో ఒక్కరోజే 1,693 కేసులు నమోదవగా.. 17మంది చనిపోయారు.
- జమ్ముకశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో 700మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.