తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టిక్​టాక్' ​ నిషేధానికే యువత మద్దతు! - మద్రాసు హైకోర్టు

దేశంలో 80 శాతం మంది యువత 'టిక్​టాక్' యాప్​ను నిషేధించాలని భావిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మద్రాసు హైకోర్టు టిక్​టాక్​ను నిషేధించాలని కేంద్రానికి ఇటీవల సూచించిన నేపథ్యంలో... 'ఇన్​షార్ట్' సంస్థ ఈ సర్వే నిర్వహించింది.

టిక్​ టాక్

By

Published : Apr 10, 2019, 1:28 PM IST

భారత్​లో ప్రతి 10 మందిలో 8 మంది యువత వీడియో షేరింగ్ మొబైల్​​ యాప్ 'టిక్​టాక్' నిషేధానికే మొగ్గు చూపుతున్నారని ఓ సర్వే వెల్లడించింది.
టిక్​టాక్​ను నిషేధించాలని కేంద్రాన్ని మద్రాస్​ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 'ఇన్​షార్ట్' సంస్థ ఈ సర్వే చేసింది.

18 నుంటి 35 ఏళ్ల వయసున్న 30వేల మంది యువతీ యువకుల అభిప్రాయాలను తెలుసుకుంది సంస్థ. ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 80 శాతం మంది 'టిక్​టాక్​' నిషేధానికి అనుకూలంగా స్పందించారు. 20 శాతం మంది నిషేధాన్ని వ్యతిరేకించారు.

జనవరిలోనే 43శాతం మంది..

ఇదిలా ఉండగా... ఈ ఏడాది జనవరిలోనే 43 శాతం మంది కొత్తగా టిక్​టాక్​ను వాడటం ప్రారంభించారని తెలిపింది ఇన్​షార్ట్​.
ప్రపంచ వ్యాప్తంగా టిక్​టాక్​ను వంద కోట్ల మంది వాడుతున్నారు. భారత్​లో దాదాపు 5కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు సర్వే పేర్కొంది.

యాప్​ను నిషేధించాలంటూ కోర్టు తీర్పు

టిక్టాక్ యాప్​​ అశ్లీలతను ప్రోత్సహిస్తోందని... సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని మద్రాసు హైకోర్టు ఈ నెల 5న తీర్పునిచ్చింది. దేశంలో ఈ యాప్​ను నిషేధించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

దీనిపై స్పందించిన టిక్టాక్​ యాజమాన్యం... భారత్​లోని ఐటీ నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details