ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని వాహనం ఢీకొట్టగా 8 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. మొర్దాబాద్-ఆగ్రా జాతీయ రహదారిపై లెహ్రావాన్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకకు హాజరై వాహనంలో తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని ఎస్పీ యమునా ప్రసాద్ పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు.
పెళ్లింట తీవ్ర విషాదం- 8 మంది మృతి - రోడ్డు ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తున్న వారి వాహనం... లారీని ఢీ కొట్టడం వల్ల ఘోరం జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్ రోడ్డు ప్రమాదం