తమిళనాడులోని తిరుచురాపల్లి విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన 10 మంది ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న 8.5 కిలోల పుత్తడిని గుర్తించి సీజ్ చేశారు.
ఎయిర్పోర్టులో 8.5 కిలోల బంగారం పట్టివేత - బంగారం పట్టివేత
తమిళనాడు తిరుచురాపల్లి విమానాశ్రయంలో ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసిన ఆ బంగారం విలువ సుమారు రూ. 4.25 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపారు.
![ఎయిర్పోర్టులో 8.5 కిలోల బంగారం పట్టివేత 8.5 kg gold smuggled seized in Trichy Airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9774415-261-9774415-1607166285774.jpg)
8.5 కిలోల బంగారం పట్టివేత
ప్రయాణికులు తమ శరీరంలో దాచిపెట్టి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించారని అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Dec 5, 2020, 5:23 PM IST