తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నీరు మిగిల్చిన నదీ స్నానం - 8 మంది మృతి - మృతి

మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు. కాలీసింధ్​ నదిలో స్నానం చేయడానికి వెళ్లి మునిగిపోవడం వల్ల ఈ విషాదం చోటు చేసుకుంది.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశారు.

కన్నీరు మిగిల్చిన నదీ స్నానం - 8 మంది మృతి

By

Published : May 2, 2019, 7:30 PM IST

Updated : May 2, 2019, 7:59 PM IST

కన్నీరు మిగిల్చిన నదీ స్నానం

మధ్యప్రదేశ్​లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలీసింధ్​ నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఈ ఘటన రాజ్​గఢ్​ జిల్లాలోని తితారీ గ్రామంలో జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు.

స్నానం చేసేందుకు వెళ్లి...

స్నానం చేసేందుకు 8 మంది తితారీలోని కాలీసింధ్​ నదికి వెళ్లారు. స్నానం చేస్తుండగా ఓ బాలుడు నదిలో కొట్టుకుపోయాడు. బాలుడి అరుపులు విన్న ఓ మహిళ... అతడిని రక్షించేందుకు నది లోపలికి వెళ్లారు. వీరిద్దరిని మిగతా వారు అనుసరించారు. దీంతో వారూ మునిగిపోయారు. ఇలా ఎనిమిది మంది మృతిచెందారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికితీశారు. ఒకరి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: సీబీఎస్​ఈ ఫలితం: స్మృతి గర్వం- కేజ్రీ ఆనందం

Last Updated : May 2, 2019, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details