20కి చేరిన మృతులు...
మహారాష్ట్రలో బస్సు, ఆటో బావిలో పడిన ఘటనలో.. మృతుల సంఖ్య 20కి చేరింది. మరో 30 మందిని రక్షించారు అధికారులు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
21:23 January 28

17:42 January 28
మహారాష్ట్ర ప్రమాదంలో 20కి చేరిన మృతులు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీ కొని ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మాలెగావ్ నుంచి ధోబీఘాట్కు వెళ్తున్న ఓ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొని బావిలో పడ్డాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రులకు తరలించారు.
బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.