తెలంగాణ

telangana

కేరళలో కరోనా విజృంభణ- 'మహా'లో తగ్గిన కేసులు

By

Published : Oct 3, 2020, 7:47 PM IST

Updated : Oct 3, 2020, 8:56 PM IST

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. మహారాష్ట్రంలో తాజాగా 14,348 కేసులు వెలుగుచూశాయి. కేరళలో కొత్తగా 7,834 మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. మరో 22మంది వైరస్​కు బలయ్యారు. అటు తమిళనాడు, దిల్లీల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

7,834 new #COVID19 cases, 4,474 recoveries & 22 deaths reported in Kerala today
కేరళలో తగ్గని కరోనా ఉద్ధృతి- కొత్తగా 7,834 కేసులు

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టుగా కనపడుతోంది. తాజాగా.. 14,348 వైరస్​ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,34,555కు పెరిగింది. మరో 278మంది మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 37,758కి చేరింది. తాజాగా 16,835మంది కరోనాను జయించారు.

కేరళలో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 7,834మందికి కరోనా సోకింది. మరో 22మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,818కి చేరగా.. వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,39,620కు పెరిగింది.

తమిళనాడులో వైరస్​ విజృంభిస్తోంది. కొత్తగా 5,622మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. మరో 65మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 6,14,507కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 46,255 యాక్టివ్​ కేసులున్నాయి.

  • దిల్లీలో తాజాగా 2,258 కేసులు బయటకు వచ్చాయి. 34 మరణాలు నమోదయ్యాయి. 2,87,930మంది ఇప్పటి వరకు వైరస్​ బారినపడ్డారు. 5,472మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 2,150 కేసులు వెలుగుచూశాయి. 14మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 1,41,846కి చేరింది. మృతుల సంఖ్య 1,530కి పెరిగింది.

ఇదీ చూడండి:-ప్రియుడితో కలిసి సొంత చెల్లినే హత్య చేసింది!

Last Updated : Oct 3, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details