కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలమవుతున్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 7,717 కేసులు వెలుగుచూశాయి. మరో 282మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,91,440కి చేరింది. ఇప్పటివరకు 14,165 మంది మృతిచెందారు. 2లక్షల 32వేల మందికిపైగా వ్యాధి నుంచి కోలుకున్నారు.
తమిళనాడులో..
తమిళనాడులోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 6,972 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 88మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,27,688కి చేరింది. మృతుల సంఖ్య 3,659కి పెరిగింది. వైరస్ బారినపడినవారిలో 1,66,956మంది కోలుకున్నారు.
కర్ణాటకలో..
కర్ణాటకలో కొత్తగా 5,536 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 102మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,001కు చేరగా.. మరణాల సంఖ్య 2,055కి పెరిగింది.
యూపీలో భారీగా..
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరో 3,458 మంది వైరస్ బారినపడ్డారు. 24 గంటల్లో 41మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73,951కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,497కి చేరింది. ఇప్పటి వరకు 20లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.
దేశరాజధానిలో..