ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలంటుంటారు. అది పెళ్లి అయినా.. పిల్లలను కనటం అయినా.. ఇదంతా నిన్నటి మాట. ఈ మాటలకు విరుద్ధంగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఓ వృద్ధురాలు(73 ఏళ్ల వయసులో) కవల పిల్లలకు జన్మనిచ్చింది. తాజాగా రాజస్థాన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ బామ్మ 75 ఏళ్ల వయస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కోటా నగరంలోని కింకర్ ఆసుపత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కృత్రిమ సంతాన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ప్రక్రియ ద్వారా ఆమె జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.
75 ఏళ్ల వయసులో 'అమ్మ' అయిన 'బామ్మ'! - 75 year old women gave birth a baby girl
75 ఏళ్ల వయసులో ఓ బామ్మ గర్భాన్ని దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా రాజస్థాన్‌లోని కోటా నగరంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. కృత్రిమ సంతాన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ప్రక్రియ ద్వారా ఆ బామ్మ బిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.
75 ఏళ్ల వయసులో అమ్మ అయిన బామ్మ!
మొదట్లో తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా, డాక్టర్లు కష్టపడి ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం పాపకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: పాక్ దురాగతానికి అమరుడైన జవాన్
Last Updated : Oct 13, 2019, 11:51 PM IST