తెలంగాణ

telangana

ETV Bharat / bharat

74% మందికి వార్తా ఛానళ్లే వినోదానికి వేదిక

దేశంలో ప్రస్తుతం న్యూస్​ ఛానళ్లలో అసలు వార్తలకన్నా వినోదమే ఎక్కువగా ఉందని దాదాపు 74 శాతం మంది భావిస్తున్నట్లు ఓ సర్వే ద్వారా తెలిసింది. లాక్​డౌన్​ ప్రభావంతో కొత్త కంటెంట్​ నిలిచిపోవటం వల్ల.. వినోదం కోసం వార్తా ఛానళ్లను ఆశ్రయించినట్లు చాలా మంది తెలిపారు.

news channels
వార్తాఛానళ్లు

By

Published : Oct 7, 2020, 3:43 PM IST

వార్తా ఛానళ్లకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది ఓ సర్వే. దేశంలో నాలుగింట మూడొంతుల మంది వార్తా ఛానళ్లను వినోదాత్మకమైనవిగా భావిస్తున్నారని తెలిపింది.

"భారత్​లో వార్తా ఛానళ్లలో న్యూస్​ కన్నా వినోదమే ఎక్కువా?" అని అడిగిన ప్రశ్నకు 73.9 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. 22.5 శాతం మంది కాదని, మరో 2.6 శాతం తెలియదని చెప్పారు.

  • లింగ పరంగా చూస్తే 75.1 శాతం మంది పురుషులు.. 72.7 శాతం మంది మహిళలు అంగీకరించారు.
  • వయసు వారీగా చూస్తే 55 ఏళ్లలోపు వారు 70 శాతం మంది, 55 ఏళ్లకు పైబడిన వారు 68.7 శాతం వార్తా ఛానళ్లు వినోద ఛానళ్లుగా పనిచేస్తున్నాయన్నారు.
  • ప్రాంతాలు, వర్గాల వారీగా చూసినా.. ఇదే రకమైన అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణ భారతంలో మాత్రం ఇతర ప్రాంతాలతో పోల్చితే కాస్త తక్కువగా 67.1శాతం మంది వార్తా ఛానళ్లలో న్యూస్​కన్నా వినోదం ఎక్కువగా ఉందని చెప్పారు.

లాక్​డౌన్​ ప్రభావం..

లాక్​డౌన్ కారణంగా చిత్రీకరణలు, సినీ నిర్మాణ రంగానికి బ్రేక్ పడటం వల్ల కొత్త కంటెంట్​ దాదాపు నిలిచిపోయింది. ఈ సమయంలో వార్తా ఛానళ్ల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపారు. కానీ, వార్తా ఛానళ్లలో వినోదం కోరుకోవటం వల్ల వాటి విశ్వసనీయత చాలా రకాలుగా దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సర్వేను ఐఏఎన్​ఎస్​ సీ-ఓటర్ మీడియా ట్రాకర్​ నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 5 వేల మందిని ప్రశ్నించింది.

ఇదీ చూడండి:సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ పోరు

ABOUT THE AUTHOR

...view details