తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత దేశ ప్రజలమైన మేము... - నేడు భారత రాజ్యాంగ దినోత్సవం

ప్రజాస్వామ్య భారతంలో సమున్నత ఆలయం పార్లమెంట్. అక్కడ అన్ని మతాలకు ఆమోద యోగ్యమైన పవిత్రగ్రంథం... రాజ్యాంగం. అంతటి విశిష్టత ఉన్న రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ మహాగ్రంథం రూపకల్పనకు సంబంధించిన కీలకమైన, ఆసక్తికరమైన విషయాలతో కూడిన కథనాల సమాహారం మీ కోసం...

70th-constitution-day-celebrations-today
భారత ప్రజలమైన మేము.. రాజ్యాంగం కల్పించిన...

By

Published : Nov 26, 2019, 11:53 AM IST

Updated : Nov 26, 2019, 1:12 PM IST

'భారత ప్రజలమైన మేము
భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద,
లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా
నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక,
ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన,
భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం,
ఆరాధన విషయాల్లో స్వాతంత్య్రాన్నీ,
అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వం
చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవం,
జాతీయ ఐక్యత, అఖండతనూ సంరక్షిస్తూ,
సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించడానికి
సత్యనిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని
1949వ సంవత్సరం నవంబరు 26వ తేదీన
మా రాజ్యాంగ సభలో ఆమోదించి, శాసనంగా
రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని
మాకు మేము సమర్పించుకుంటున్నాం'

1949 నవంబర్​ 26... భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు. నేటికి 70ఏళ్లు. రాజ్యాంగ నిర్మాణం వెనక ఎన్నో పోరాటాలు, ఆకాంక్షలు, సామాజిక విప్లవ అభినివేశాలు ఉన్నాయి. ఎందరో మహామహులు రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు మీకోసం...

ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రూపక భారత రాజ్యాంగం- కాగితాల పొత్తం కాదు, మానవాళిలో ఏడోవంతు జనావళి ప్రగతిశీల కాంక్షల పరిరక్షణ ఛత్రం. ఎలాంటి భేదభావాల్లేకుండా పౌరులందరి పట్లా సమభావానికి, సమన్యాయానికి భరోసా ఇస్తున్న సంవిధాన శాసనం!

ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం. దాదాపు మూడేళ్లపాటు సాగిన రాజ్యాంగ రచనలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు? మహామహుల కృషి ఏ రీతిన సాగింది? అనేవి కీలకాంశాలు.

ఆలోచన శక్తి.. వాదనా పటిమ.. ఒప్పించే నేర్పు.. ఇవన్నీ డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్​ సొంతం. భారతీయులను ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన. రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు అంబేడ్కర్​. రాజ్యాంగ రచన కోసం రేయింబవళ్లూ శ్రమించారు. అంటరానితనాన్ని నిషేధించి.. ఊరూరా నిలువెత్తు విగ్రహమై నిలిచారు ఆ మహోన్నత మూర్తి.

డా. రాజేంద్ర ప్రసాద్... రాజ్యాంగ శిల్పి, గొప్ప నాయకుడు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్​లో బిహార్​ నుంచి ఎంపికైన 36 మంది సభ్యుల్లో ఆయన ఒకరు. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో డా. రాజేంద్ర ప్రసాద్​ పాత్రపై ప్రత్యేక కథనం.

రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికవడానికి ముందే.. మధ్యంతర అధ్యక్షుడిగా డాక్టర్​ సచిదానంద సిన్హా పనిచేసిన విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ప్రత్యేక బిహార్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సిన్హాను 1946 డిసెంబరు 9న భారతదేశ రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఆనాటి కాంగ్రెస్​ అధ్య​క్షుడు ఆచార్య జేబీ కృప్లానీ. ఆ తర్వాత రెండు రోజులకే 1946 డిసెంబరు 11న డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​.. రాజ్యాంగ పరిషత్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నర్సింగ​రావు... భారత రాజ్యాంగ పరిషత్​కు న్యాయ సలహాదారు. భారత ప్రభుత్వ చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 1948 ఫిబ్రవరిలో రాజ్యాంగ తొలి ముసాయిదా ప్రతిని తయారుచేశారు.

భారత రాజ్యాంగం... ఎన్నో దేశాల రాజ్యాంగాల్లోని కీలక అంశాల సమాహారం. బ్రిటన్​, ఐర్లాండ్, అమెరికా సహా అనేక దేశాల మేలైన లక్షణాలు భారత రాజ్యాంగంలో ఒదిగిపోయాయి.

రాజ్యాంగం, దేశానికి నినాదమైన 'సత్యమేవ జయతే'ను మండుకోపనిషత్‌, అధర్వణ వేదం నుంచి స్వీకరించారు. భారత దేశానికి ఈ నినాదం ఉండాలని తొలిసారిగా చెప్పింది పండిట్‌ మదన్‌ మోహన్ మాలవీయా.

పాలకులకు, పాలితులకు మధ్య సంబంధాన్ని క్రమబద్ధం చేసే నిబంధనావళి రాజ్యాంగం. రాజ్యాంగబద్ధత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ప్రజాస్వామ్యంలో పౌరులే పాలకులు, పాలితులు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని నియంత్రించడానికి రాజ్యాంగం అవసరమా? గత 70 ఏళ్లలో మన రాజ్యాంగం సగటు పౌరుని ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిందా?

1949 నవంబర్​ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ '26'కు భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఎంతో సంబంధముంది.

భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టాలు ఎన్నో. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి వరకు ఎన్నో సంఘటనలు, నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. వాటిలో రాజ్యాంగ నిర్మాణం ప్రముఖమైంది. ఆ మహా గ్రంథం తయారీకి అయిన ఖర్చు రూ. 64 లక్షలు.

1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం. ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 103సార్లు సవరించారు. వీటిల్లో కొన్ని దేశ గతినే మార్చేశాయి.

రాజ్యాంగంలోని అంశాలపై సందేహాలు కలిగితే ఎవరిని ఆశ్రయించాలి? ఆ అనుమానాలను ఎవరు నివృత్తి చేస్తారు? ఈ ప్రశ్నలకు వచ్చే ఒకే ఒక్క సమాధానం.. సుప్రీం ధర్మాసనాలే. రాజ్యాంగంలోని కీలక అంశాలపై ఉన్న అనుమానాలు తీర్చేది.. ఈ న్యాయమూర్తులే. ఇలాంటి సందర్భాలెన్నో పలు కేసుల రూపంలో ఎదురయ్యాయి కూడా.

Last Updated : Nov 26, 2019, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details