గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వారం రోజుల్లోనే 700మంది సూపర్ స్ప్రెడర్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ క్వారంటైన్లో చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కూరగాయలు విక్రయించే వారు, కిరాణ దుకాణాలు నిర్వహించే వారు, ఇతర నిత్యావసరాల వ్యాపారాలు చేసే వారిని సూపర్ స్ప్రెడర్స్ అంటారు. వీరి నుంచి అనేక మందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 7నుంచి 14 వరకు అహ్మదాబాద్‌లో పూర్తిగా లాక్డౌన్ విధించారు. పాలు, ఔషధ దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ వారం రోజుల్లోనే 33,500మంది సూపర్ స్ప్రెడర్స్‌కు స్క్రీనింగ్ నిర్వహించారు. 12,500 మందికి వైరస్ పరీక్షలు చేయగా 700మందికి వ్యాధి సోకినట్లు గుర్తించారు. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్ గుప్తా తెలిపారు.