ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం మనలో అనేక మందికి జంతువులంటే చాలా ఇష్టం. ఓ ముద్ద ఆహారంగా పెడితే... మన మీద ఎంతో విశ్వాసం చూపే శునకాలంటే ఇంకెంతో ఇష్టం. మనం మహా అయితే ఒకటో రెండో కుక్కలను పెంచుకుంటాం. కానీ కేరళ కొట్టాయం జిల్లా కొడిమథాకు చెందిన అమ్మిణి అమ్మ ఏకంగా 40 వీధి కుక్కలను పెంచి పోషిస్తోంది.
ఆహారం కోసం ఎదురు చూస్తున్న శునకం అలాంటి వాటినే..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన శునకాలను తీసుకొచ్చి, వాటికి చికిత్స అందిస్తుంది అమ్మిణి. తన సొంత పిల్లల్లాగే వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, శునకాల కోసమే ఏర్పాటు చేసిన బోనుల్లో ఉంచి ఆహారం అందిస్తుంది. గత పన్నెండేళ్లుగా ఇదే పనిగా వాటికి సేవలందిస్తోంది ఆ 70ఏళ్ల బామ్మ.
శునకాన్ని ముద్దుగా నెమరుతున్న అమ్మిణి ఎందుకంటే..
జనావాస ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్న శునకాలను.. ప్రజల ఫిర్యాదుల మేరకు నియంత్రించడానికి వాటిని చంపేస్తుంటారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఈ క్రమంలోనే అమ్మ అల్లారుముద్దుగా పెంచుకున్న శునకాన్నీ చంపేశారు. అప్పటి నుంచి వీధి కుక్కల రక్షణ బాధ్యతను చేపట్టింది. ఈ పనిలో ఆమె కుమార్తె కూడా సాయం చేస్తుంటుంది. సమీపంలో నివసించేవారు కూడా తమ శునకాల్ని అమ్మిణి వద్ద వదిలి వెళ్తుంటారు.
శునకాలకు ఆహారం పెడుతున్న అమ్మిణి పెట్రోలు బంకులో పని చేస్తూ..
తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ పెట్రోలు బంకులో పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు అమ్మిణి, ఆమె కుమార్తె. ఆ వచ్చిన ఆదాయంతోనే శునకాల ఆలనా పాలనా చూస్తున్నారు.
శునకాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులు ఇదీ చూడండి:వైరల్: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటోషూట్