వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ.. అయినా మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన దిట్ట. వయసు పైబడినా తనలో ఏమాత్రం సత్తువ తగ్గలేదని నిరూపిస్తున్నాడో 70 ఏళ్ల పెద్దమనిషి. కుటుంబ పోషణ కోసం బేల్దార్‌గా పనిచేస్తూ రోజుకు రూ. 800 సంపాదిస్తూనే.. మరోపక్క మార్షల్ ఆర్ట్స్ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు తమిళనాడుకు చెందిన గణపతి మురుగేశన్.
70 ఏళ్ల ప్రాయంలోనూ ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ! - సిలంబం
శాస్త్ర సాంకేతికత రాజ్యమేలుతున్న నేటి తరంలో ప్రాచీన యుద్ధకళను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాడో వ్యక్తి. తాపీపనితో ఓ పక్క కుటుంబాన్ని పోషిస్తూనే.. తనకు తెలిసిన విద్యను మరో తరానికి అందించాలని లక్ష్యంగా పని చేస్తున్నాడు. ఇందుకోసం సుమారు 200 మందికి తర్ఫీదునిస్తున్నాడీ పెద్దమనిషి.

70ఏళ్ల ప్రాయంలోనూ 200మందికి ఉచిత మార్షల్ఆర్ట్స్ శిక్షణ!
70ఏళ్ల ప్రాయంలోనూ 200మందికి ఉచిత మార్షల్ఆర్ట్స్ శిక్షణ!
రామేశ్వరంలో సుమారు 200 మంది పిల్లలకు.. 'సిలంబం' అనే మార్షల్ ఆర్ట్స్‌ను ఉచితంగా నేర్పిస్తున్నాడు మురుగేశన్. కనుమరుగై పోతున్న ఈ కళను రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా మురుగేశన్ శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం రోజుకు రెండుసార్లు తరగతులను నిర్వహిస్తున్నాని చెప్పుకొచ్చారు.