హరియాణా పంచకులలోని మాతా మానసా దేవి గోశాలలో 70 ఆవులు చనిపోయాయి. మరో 30 గోవులు అస్వస్థతకు గురయ్యాయి. ఈ మేరకు గోశాల యాజమాన్యం సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చింది.
విషాహారం తిని 70 గోవులు మృత్యువాత - desi cow haryana news
హరియాణాలోని పంచకులలో దారుణం జరిగింది. సుమారు 70 ఆవులు విషపూరిత ఆహారం తిని చనిపోయాయి. ఈ మేరకు గోశాల ప్రతినిధులు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు.
విషాహారం తిని 70 గోవుల మృత్యువాత
దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన డాక్టర్ అనిల్.. గోవులు విషపూరిత ఆహారం తీసుకోవడం వల్ల మరణించాయని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. పూర్తి వివరాలు వైద్య పరీక్షల అనంతరం తెలుస్తాయన్నారు. అస్వస్థతకు గురైన గోవులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.